రాచకొండ కమిషనరేట్ పరిధిలో అంతరాష్ట్ర సెల్‌ఫోన్ దొంగల ముఠా బస్టైంది. మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.50 లక్షల విలువైన 473 మొబైల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన ప్రధాన నిందితుడు సాయి కుమార్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ముఠా రాష్ట్రాల మధ్య తిరుగుతూ భారీ స్థాయిలో సెల్‌ఫోన్లు దొంగిలించిందని పోలీసులు వెల్లడించారు.
Read More : కూకట్‌పల్లిలో వర్షం కారణంగా భారీ ట్రాఫిక్ జామ్

One thought on “రాచకొండలో అంతరాష్ట్ర సెల్‌ఫోన్ దొంగల ముఠా బస్టు”
Comments are closed.