లిక్కర్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్

లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌, బాలాజీ గోవిందప్ప, మిథున్‌రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది.

నిందితుల తరపు న్యాయవాదుల వాదనలు, ప్రాసిక్యూషన్ వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ నలుగురు నిందితులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. బెయిల్ పిటిషన్లు డిస్మిస్ కావడంతో వారికి బెయిల్ లభించే అవకాశాలు ప్రస్తుతానికి లేవు. కేసు విచారణ కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది.

Read More : స్త్రీ శక్తి పథకం సూపర్ హిట్ – రోజుకు 25 లక్షల మహిళలు లాభం

One thought on “లిక్కర్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్

Comments are closed.