‘గీతాంజలి’ హీరోయిన్ గిరిజ వీడియో బైట్ వైరల్

తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమా ‘గీతాంజలి’. ఈ సినిమాలో హీరోగా నాగార్జున నటించగా, హీరోయిన్‌గా నటించిన గిరిజ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. సినిమా విడుదలైన 35 సంవత్సరాల తర్వాత, నాగార్జున గురించి గిరిజ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఫ్యామిలీ స్టార్ జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి అనే టాక్ షోలో మొదటి గెస్ట్‌గా నాగార్జున పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్‌కు గీతాంజలి హీరోయిన్ గిరిజ పంపిన వీడియో బైట్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

గిరిజ ఏమన్నారంటే..

ఆ వీడియోలో గిరిజ మాట్లాడుతూ, “నా మొదటి సినిమాకు కో-స్టార్‌గా నాగ్‌ గారు లభించడం చాలా సంతోషంగా ఉంది. ఆయనతో కలిసి నటించే అవకాశం ఇచ్చినందుకు ఎప్పటికీ కృతజ్ఞురాలిని. ఆయన గొప్ప వ్యక్తి, లెజెండరీ నటుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాగ్‌ సార్‌లో మంచి హాస్యం ఉంటుంది. ఆయన ప్రతి విషయంలోనూ నాకు చాలా మద్దతుగా ఉండేవారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నాకు చాలా విషయాలు నేర్పిన నాగ్‌ సర్‌కి కృతజ్ఞతలు” అని అన్నారు.

గిరిజ లుక్‌పై చర్చ

ఈ టాక్ షోలో కనిపించిన గిరిజ కొత్త లుక్‌ను చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఆమెలో వచ్చిన మార్పు కారణంగా కొందరు ఆమెను గుర్తు పట్టలేకపోయారు. దీంతో గిరిజ లుక్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి.

చాలా ఏళ్లుగా మీడియాకు దూరంగా ఉంటున్న గిరిజ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్లు తిరిగి నటిస్తున్న ఈ తరుణంలో మళ్లీ సినిమాల్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read More : రాహుల్ సిప్లిగంజ్–హరిణి రెడ్డి నిశ్చితార్థం..

One thought on “‘గీతాంజలి’ హీరోయిన్ గిరిజ వీడియో బైట్ వైరల్

Comments are closed.