వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదలయ్యారు. మొత్తం 137 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఆయన తాజాగా బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా వంశీని ఆయన అభిమానులు, అనుచరులు పెద్దఎత్తున స్వాగతించారు. వంశీపై నమోదైన పలు కేసుల నేపథ్యంలో ఇటీవల పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు ఆయన 137 రోజులు రిమాండ్‌లో గడిపారు. ప్రస్తుతం బెయిల్‌పై విడుదలవడంతో వంశీ తిరిగి తన కుటుంబంతో కలిశారు.
ఇటు ఆయన విడుదలపై వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తుండగా, రాజకీయంగా వంశీ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠ కలిగిస్తోంది.
Read More : మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్ కలకలం
