బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు

తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ చేశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేశారని ఆయన తీవ్రంగా విమర్శించారు.

ప్రజాప్రతినిధిపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని కేటీఆర్ నిలదీశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి స్థాయి లేని వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని హెచ్చరించారు. బండి సంజయ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ, భవిష్యత్తులో అసత్య ఆరోపణలకు దూరంగా ఉండాలని సూచించారు.

Read More : హైదరాబాద్‌లో బీజేపీ నేత రామచందర్‌రావు గృహనిర్బంధం

One thought on “బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు

Comments are closed.