హైదరాబాద్‌లో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావును పోలీసులు ఈ ఉదయం ఆయన నివాసంలోనే గృహనిర్బంధం చేశారు. బంజారాహిల్స్‌లోని పెద్దమ్మ గుడిలో నిర్వహించనున్న కార్యక్రమానికి ఆయన వెళ్లకుండా అడ్డుకోవడమే ఇందుకు కారణం. ఇటీవల దుండగులు ధ్వంసం చేసిన పెద్దమ్మ గుడిలో కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి రామచందర్‌రావు హాజరవుతారని సమాచారం రావడంతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు ఆయనను ఇంటి నుంచి బయటకు రానీయలేదు.
ఈ పరిణామంతో ఆయన సికింద్రాబాద్, గోషామహల్ నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన ‘హర్ ఘర్ తిరంగా’ యాత్ర కూడా నిలిచిపోయింది.
రామచందర్‌రావు గృహనిర్బంధాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి ప్రతిపక్ష నాయకులను అణచివేయడం దురదృష్టకరమని, నిర్బంధాలతో కార్యక్రమాలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వానికి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనలో తేడా లేదని, ముందస్తు అరెస్టులు పరిపాటిగా మారాయని ఆయన ఆరోపించారు. ఇదే ధోరణి కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
Read More : మద్యం మత్తులో డ్రైవర్: ఓఆర్‌ఆర్‌పై ముగ్గురు కార్మికుల మృతి

One thought on “హైదరాబాద్‌లో బీజేపీ నేత రామచందర్‌రావు గృహనిర్బంధం”
Comments are closed.