బీఆర్ఎస్ పార్టీని మరే ఇతర పార్టీలో విలీనం చేసే ప్రశ్నే లేదని, తెలంగాణ ఉన్నంతవరకు బీఆర్ఎస్ కొనసాగుతుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన కేటీఆర్, బీఆర్ఎస్ విలీనం అనే వాదన పూర్తిగా అప్రాసంగికమని కొట్టిపారేశారు. రాజకీయ ఇరకాటంలో పడిన ప్రతిసారీ బీజేపీ, కాంగ్రెస్‌లు ఈ విలీనం అంశాన్ని ప్రస్తావిస్తుంటాయని విమర్శించారు.
స్కాంల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ వాదన తెరపైకి తెస్తున్నారని ఆరోపించిన కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎం రమేశ్ ఇద్దరూ కలిసి వస్తే తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
Read More : అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం – హరీష్ రావు

One thought on “బీఆర్ఎస్ విలీనం ప్రశ్నే లేదు – కేటీఆర్ స్పష్టం”
Comments are closed.