తమిళనాడులో బాంబు బెదిరింపు కలకలం

తమిళనాడులో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. సీఎం ఎం.కే. స్టాలిన్, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంపై బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని దుండగులు ఫోన్ ద్వారా బెదిరింపు కాల్స్ చేశారు. ఈ కాల్స్ అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమై వేగంగా స్పందించారు.

చెన్నై విమానాశ్రయం పరిసరాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టిన పోలీసులు ఏవైనా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయా అని ప్రతి మూలను పరిశీలించారు. ప్రత్యేక బాంబ్ స్క్వాడ్ సహాయంతో విస్తృతంగా శోధించిన అనంతరం ఈ బెదిరింపు తప్పుడు సమాచారమని నిర్ధారించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపు కాల్స్ చేసిన వారి గుర్తింపుకు సాంకేతిక సహాయంతో ప్రత్యేక బృందాలను నియమించారు. ఇటువంటి తప్పుడు బెదిరింపులు ప్రజల్లో భయాందోళనలు రేపుతాయని, నిందితులను త్వరలోనే గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Read More : డిశ్చార్జ్ అయిన తమిళనాడు సీఎం స్టాలిన్

One thought on “తమిళనాడులో బాంబు బెదిరింపు కలకలం

Comments are closed.