డిశ్చార్జ్ అయిన తమిళనాడు సీఎం స్టాలిన్

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కే. స్టాలిన్‌ ఆరోగ్యంగా కోలుకుని ఆదివారం సాయంత్రం చెన్నై అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆరు రోజుల క్రితం ఆయనకు అకస్మాత్తుగా కళ్లుతిరగడంతో ఆసుపత్రిలో చేరారు. జూలై 21 ఉదయం వాకింగ్ చేస్తుండగా 72 ఏళ్ల స్టాలిన్ అస్వస్థతకు గురవడంతో చెన్నై థౌజండ్ లైట్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఉన్న సమయంలోనూ ఆయన సీనియర్ అధికారులతో నిరంతరంగా సంప్రదింపులు జరుపుతూ ప్రభుత్వ పనులను పర్యవేక్షించారు.

వైద్యుల ప్రకారం, ప్రాథమిక పరీక్షల్లో గుండె కొట్టుకునే విధానంలో స్వల్ప హెచ్చుతగ్గులు గుర్తించడంతో యాంజియోగ్రామ్ నిర్వహించారు. చికిత్సకు మంచి స్పందన చూపిన స్టాలిన్ పూర్తిగా కోలుకున్నారని అపోలో వైద్య బృందం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

“ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్‌ అపోలో నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం డిశ్చార్జ్ చేస్తున్నాం” అని ప్రకటనలో వెల్లడించింది.

డాక్టర్ల సలహా మేరకు స్టాలిన్ మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకుని తర్వాత సాధారణ పరిపాలనా బాధ్యతలు చేపట్టనున్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో ఆయన ఆసుపత్రి నుంచి బయలుదేరారు.

Read More : కేదార్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

One thought on “డిశ్చార్జ్ అయిన తమిళనాడు సీఎం స్టాలిన్

Comments are closed.