కృష్ణా జిల్లాలో వైసీపీ నేతల భూకబ్జా.. యువకుల నిరసన

Land grabbing cases

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న భూకబ్జా వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా, కృష్ణా జిల్లా గన్నవరం రాజీవ్ కాలనీలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని వైసీపీ నాయకులు ఆక్రమించిన ఘటనపై పెద్ద దుమారం రేగింది. ఈ అక్రమ భూకబ్జాలను స్థానిక యువకులు అర్ధరాత్రి అడ్డుకున్నారు. నాయకులు వేసిన స్తంభాలను ధ్వంసం చేసి తమ నిరసన తెలియజేశారు. ఈ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్లు మాజీ ఎమ్మెల్యే వంశీ హయాంలో జరిగాయని, ఎన్నికల సమయంలో అదే భూమిపై వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు హామీలు ఇచ్చారని సమాచారం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ సాగర్ల సంఘం కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు.

పీలేరు మండలంలో వైసీపీ నేతల అక్రమ భూకబ్జాలు బహిరంగం

ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు మండలంలో వైసీపీ నేతల అక్రమ భూకబ్జా వ్యవహారాలు బయటపడుతున్నాయి. ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిన భూములను, రిజర్వ్ ఫారెస్ట్ భూములను వైసీపీ నేతలు అక్రమంగా తమ పేర్లపై రిజిస్టర్ చేసుకున్నట్లు రివెన్యూ శాఖ విచారణలో తేలింది. పీలేరు మండలం గూడరేవుపల్లె, ఎర్రగుంటపల్లి, తలపుల గ్రామాల్లో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు వైసీపీ నేతలు కబ్జా చేసినట్టు నివేదికలు చెబుతున్నాయి. పీలేరు మండలంలో కనీసం రూ.175 కోట్ల విలువైన భూములను అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్లు అంచనా. ఇందులో మాజీ మంత్రి పెద్దిరెడ్డికి అనుచరులుగా పేరొందిన నాయకుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.

కూటమి ప్రభుత్వం విచారణలో కీలక విషయాలు వెలుగు

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైసీపీ నేతల భూకబ్జాలపై ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. రివెన్యూ శాఖ ఈ ఫిర్యాదులపై దృష్టి సారించి, అక్రమ భూకబ్జాలను విచారిస్తోంది. పీలేరు మండలంలో మాత్రమే 7 కేసుల్లో రూ.175 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా అయినట్లు రికార్డులు చెబుతున్నాయి. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో భారీ స్థాయిలో భూకబ్జాలు జరిగాయని, గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ అధికారులు వైసీపీ నేతలతో కుమ్మక్కయ్యారని తాజా విచారణలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం అక్రమంగా ఆక్రమించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకునే చర్యలు చేపడుతోంది.

Read More

One thought on “కృష్ణా జిల్లాలో వైసీపీ నేతల భూకబ్జా.. యువకుల నిరసన

Comments are closed.