విమాన ప్రమాదంపై కేసీఆర్ స్పందన

గుజరాత్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో పలువురు ప్రయాణికులు, స్థానిక నివాసితులు, వైద్య విద్యార్థులు మృతి చెందిన ఘటన ఎంతో విషాదకరమని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.

ప్రమాదంలో మృతుల కుటుంబాలకు తగిన ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆర్థిక సహాయం అందించాలని, అలాగే క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని కేసీఆర్ కోరారు.

ఈ విషాదకర సమయంలో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబాలకు భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించాలన్నారు. ఘటనా స్థలంలో జరిగే సహాయ చర్యలు వేగంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.

Read More : గోషామహల్ MLA రాజాసింగ్ కీలక ప్రకటన