గోషామహల్ MLA రాజాసింగ్ కీలక ప్రకటన

raja singh

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తన రాజకీయ భవిష్యత్‌పై స్పష్టమైన ప్రకటన చేశారు. తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదని, ఇది తన చివరి రాజకీయ పార్టీ అని రాజాసింగ్ ధృఢంగా వెల్లడించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కొంతకాలంగా తనపై అనేక ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయని ఆయన తెలిపారు. తాను కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నానన్నా, పార్టీ మారుతున్నానన్నా వార్తలు నిజానికి దూరమని స్పష్టం చేశారు. గతంలో తనను 14 నెలలు పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడు కూడా బీజేపీని వీడలేదని గుర్తు చేశారు. “ఆ సమయంలోనూ వేరే పార్టీలోకి వెళ్లను, ఇప్పుడు కూడా వెళ్లే ఉద్దేశ్యం లేదు” అని స్పష్టం చేశారు.

ప్రస్తుతం తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ల వల్లే బీజేపీలో కొనసాగుతున్నానని పేర్కొన్నారు. “అయితే వీరు లేకపోతే కాబోయే పరిస్థితుల్లో పార్టీని విడిచి వెళ్లిపోయేవాడిని. కానీ మరో పార్టీలో చేరే ప్రసక్తే లేదు. రాజకీయాల నుంచే వైదొలగతాను” అని రాజాసింగ్ స్పష్టం చేశారు.

తనను బీజేపీలో ఇబ్బంది పెడుతున్న వారిని కూడా ఎదుర్కొంటానని హెచ్చరించారు. పార్టీపట్ల తన విధేయతను మరోసారి స్పష్టంగా ప్రకటించిన రాజాసింగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

Read More : రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలపై కేటీఆర్

One thought on “గోషామహల్ MLA రాజాసింగ్ కీలక ప్రకటన

Comments are closed.