రాష్ట్రంలోని ముఖ్యమైన నీటి ప్రాజెక్టుల పనులను నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా వేగవంతం చేయాలని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆదేశించారు. విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలవరం ఎడమ కాలువ, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు.
ఈ సమావేశంలో ఇరిగేషన్ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఆయా ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రాజెక్టు పనుల్లో నాణ్యతపై రాజీపడకూడదని, లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేసేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని మంత్రి సూచించారు.
ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలు పనులకు అడ్డంకిగా మారుతున్నాయని అధికారులు వివరించగా, మిషనరీ, సిబ్బంది సంఖ్యను పెంచి పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టులో హెడ్ రెగ్యులేటర్, టన్నెల్స్, ఫీడర్ కెనాల్, పునరావాస కాలనీల నిర్మాణాలను తక్షణం గడువు లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
Read More : ఇద్దరు చిన్నారులు గాయాలతో ఆసుపత్రికి తరలింపు.

2 thoughts on “ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి”
Comments are closed.