ట్రాక్టర్ ఢీకొని నాలుగేళ్ల బాలుడు మృతి

సూర్యాపేట జిల్లా కట్టంగూరు మండలం తేలువారిగూడెం గ్రామానికి చెందిన మోక్షిత్ (4) అనే చిన్నారి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్లు దండు మైసమ్మ ఆలయం సమీపంలో బంధువుల శుభ కార్యక్రమానికి తల్లిదండ్రులతో కలిసి వచ్చిన మోక్షిత్ రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది.
ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read More : విమాన ప్రమాదంపై కేసీఆర్ స్పందన

One thought on “ట్రాక్టర్ ఢీకొని నాలుగేళ్ల బాలుడు మృతి

Comments are closed.