ఢిల్లీలో రైలు ప్రమాదం

హజ్రత్ నిజాముద్దీన్ నుండి ఘజియాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 64419 నంబర్ గల లోకల్ రైలు శివాజీ బ్రిడ్జి స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ఘటనతో ప్రయాణికుల్లో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. ప్రమాదం సంభవించిన వెంటనే రైల్వే అధికారులు, రక్షణ బలగాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

పట్టాలు తప్పిన వెంటనే రైలు ధూం ధూం మంటూ గర్జించడంతో ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే ప్రాథమికంగా ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. కానీ, కొన్ని బోగీలు పట్టాలు తప్పి బయటకు జారిపోవడంతో ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటన జరిగిన ప్రదేశంలో రైల్వే ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ప్రస్తుతం అక్కడ రెస్క్యూ టీములు సహాయక చర్యలను వేగంగా చేపట్టాయి. ఇంజనీరింగ్, మెడికల్ టీములు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నాయి. అప్రమత్తంగా ఉండాలని ప్రయాణికులకు, స్థానికులకు సూచించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా విడుదల కావాల్సి ఉంది.

Read More : విమాన ప్రమాదంపై కేసీఆర్ స్పందన

One thought on “ఢిల్లీలో రైలు ప్రమాదం

Comments are closed.