కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఖండించిన టీడీపీ నేత కాట్రగడ్డ ప్రసూన

Katragadda Prasuna

తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్‌ పాత్రను ఎవరూ విస్మరించలేరని టీడీపీ మహిళా నాయకురాలు కాట్రగడ్డ ప్రసూన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ‘తాగుబోతు’ వ్యాఖ్యలపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

“తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్‌ కీలక పాత్ర పోషించారు. అన్ని పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలిగారు. నేను కూడా 18 ఏళ్ల పాటు కేసీఆర్‌తో కలిసి పని చేశాను” అని ప్రసూన తెలిపారు.

“నిన్న సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్‌ను ‘తాగుబోతు’ అన్న మాటలు నన్ను చాలా బాధించాయి. వ్యక్తిగత విషయాలను రాజకీయాలకు ముడిపెట్టడం సరైంది కాదు. నా పార్టీ ఏదైనా కానీ, పార్టీలకు అతీతంగా సీఎం రేవంత్ రెడ్డి వాడిన పదజాలాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను” అని ఆమె పేర్కొన్నారు.

“రాజకీయాలు అంటే ఇంత హీనంగా ఉండాలా? ఇంత దిగజారి మాట్లాడటం ఏ సంకేతమో అర్థం కావడం లేదు. రాజకీయాలు అంటే పథకాల ద్వారా అభివృద్ధిలో పోటీపడాలి. ప్రజలకు కొత్త పథకాలను అందించి రాజకీయాల్లో ముందు సాగాలి కానీ ఇలాంటి అసభ్య పదజాలంతో రాజకీయాలు చేయడం తగదు” అని కాట్రగడ్డ ప్రసూన హితవు పలికారు.

Read More

One thought on “కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఖండించిన టీడీపీ నేత కాట్రగడ్డ ప్రసూన

Comments are closed.