టాలీవుడ్‌లో కేవలం హీరోయిన్లకే కాదు, హీరోలకు కూడా ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఈ విషయాన్ని తాజాగా కమెడియన్ కమ్ హీరోగా మారిన సప్తగిరి చెప్పిన మాటలు నిదర్శనం. తన సినిమాకు హీరోయిన్‌గా నటించేందుకు చాలా మంది హీరోయిన్లు నో చెప్పారని ఆయన వెల్లడించారు.
ఈ మధ్య స్టార్ హీరోలకే సరైన హీరోయిన్‌ను ఎంపిక చేయడం కష్టంగా మారింది. తెలుగులో హీరోయిన్లు ఉన్నా, కొందరికే మంచి గుర్తింపు ఉంది. అందుకే ఇతర భాషల నుంచి హీరోయిన్లను తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక చిన్న హీరోల విషయంలోనూ ఇదే పరిస్థితి. మన దగ్గరున్న హీరోయిన్లు కూడా సినిమా ఎంపికలో జాగ్రత్తగా ముందుకెళుతున్నారు.
మార్చి 21న విడుదల కానున్న ‘పెళ్లి కాని ప్రసాద్’ సినిమాలో ఆయనకు జోడిగా నటించేందుకు చాలా మంది హీరోయిన్లు నో చెప్పారని, కమెడియన్ పక్కన నటించడం ఎందుకు? అంటూ వెనుకడుగేశారు. చివరికి ప్రియాంక ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించిందని సప్తగిరి తెలిపారు.
అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌కు ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దిల్ రాజు సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి!

One thought on “హీరోయిన్‌లు నో చెప్పినా… చివరికి ఆమె ఒప్పుకుంది: సప్తగిరి”
Comments are closed.