బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ కీలక నేతలతో ఆసక్తికరంగా ఇష్టాగోష్టి నిర్వహించారు. నిన్న వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాదులోని యశోద ఆసుపత్రిని సందర్శించిన కేసీఆర్‌ను పలువురు పార్టీ ముఖ్యనేతలు పరామర్శించేందుకు అక్కడికి వచ్చారు. ఈ సందర్భాన్ని ప్రయోజనకరంగా మలుచుకుంటూ, కేసీఆర్ వారితో రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై, ప్రజాసమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. రైతులకు యూరియా ఎరువుల లభ్యత, సాగునీటి సమస్యలు, వ్యవసాయ రంగ పరిస్థితులు తదితర అంశాలపై నేతలతో సమీక్షించారు. పార్టీ నాయకుల నుంచి పలు అంశాలపై ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. నూతన రాజకీయ దిశ, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కూడా కేసీఆర్ ప్రాథమికంగా చర్చించినట్లు సమాచారం.
ఈ సమావేశం, పార్టీలో మళ్లీ చురుకుదనాన్ని తీసుకురావడానికి, ప్రజల్లో తిరిగి విశ్వాసాన్ని నెలకొల్పేందుకు ఒక చురకైన ప్రారంభంగా భావిస్తున్నారు నాయకులు.
Read More : వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్‌లో కిషన్‌రెడ్డి ప్రకటన

2 thoughts on “కేసీఆర్‌తో బీఆర్ఎస్ నేతల ఇష్టాగోష్టి”
Comments are closed.