రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయాన్ని వివరించారు. ఈ ఆపరేషన్ హనుమంతుడి స్ఫూర్తితో పూర్తయ్యిందని, దేశ శక్తిని పాక్‌తో పాటు ప్రపంచానికి చూపించామని స్పష్టం చేశారు.

“ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నాం, పౌరులపై కాదు” అని రాజ్‌నాథ్ స్పష్టంచేశారు.

ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు పోరాటాన్ని ప్రశంసించిన మంత్రి, ఆయన నైపుణ్యం, ధైర్యాన్ని నేటి తరానికి ఆదర్శంగా నిలిపారు. “అల్లూరి గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్ కాలంలో ప్రాణత్యాగం చేసిన మహానాయకుడు” అని కొనియాడారు. “బానిసత్వం కాకుండా ఆత్మాభిమానంతో బతకాలని అల్లూరి జీవిత విధానం మాకు బోధిస్తుంది” అని పేర్కొన్నారు. అల్లూరి జన్మస్థలాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని క్షత్రియ సేవా సమితి (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) మరియు కేంద్ర సాంస్కృతిక శాఖ సంయుక్తంగా నిర్వహించాయి.

Read More : ఏపీని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దనున్న లోకేశ్

One thought on “రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు

Comments are closed.