పాకిస్థాన్‌కి మైక్రోసాఫ్ట్ షాక్

ఇప్పటికే ఆర్థిక మరియు రాజకీయ అస్థిరతతో సతమతమవుతున్న పాకిస్తాన్‌కు ఇప్పుడు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నుంచి పెద్ద దెబ్బ తగిలింది. మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్‌లో దాదాపు 25 సంవత్సరాల పాటు తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. జూలై 3 నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా నిశ్శబ్దంగా తమ కార్యకలాపాల నుంచి నిష్క్రమించింది. ఈ పరిణామం పాక్ టెక్నాలజీ రంగాన్ని చర్చల ముస్తాబుగా మార్చింది. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్ మాజీ చీఫ్ జావాద్ రెహ్మాన్ వెల్లడించారు. “ఇది ఒక యుగానికి ముగింపు,” అంటూ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. 2000 మార్చి 7న పాక్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన మైక్రోసాఫ్ట్, సరిగ్గా 25 ఏళ్ల తర్వాత కార్యకలాపాలను మూసివేసింది. ఇదే సమయంలో సంస్థ అధికారికంగా కారణాలను ప్రకటించనప్పటికీ… పాక్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరత, తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, వ్యాపారానికి అనుకూల వాతావరణం లేకపోవడం ప్రధాన కారణాలుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పాక్ వాణిజ్య లోటు \$24.4 బిలియన్లకు చేరగా, విదేశీ మారక నిల్వలు \$11.5 బిలియన్లకు పడిపోయాయి. అంతేకాదు, నైపుణ్యం కలిగిన టెక్ నిపుణుల కొరత కూడా కంపెనీలకు ప్రధాన అడ్డంకిగా మారినట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, భారత్ టెక్ రంగంలో స్థిరంగా ఎదుగుతూ, గ్లోబల్ పెట్టుబడులకు కేంద్రంగా మారుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. స్థిరమైన పాలన, పెట్టుబడులకు అనుకూల విధానాలు భారత్‌ను అంతర్జాతీయ సంస్థల ఆకర్షణగా నిలిపాయని విశ్లేషకుల అభిప్రాయం.

Read More : ఉక్రెయిన్‌కు ఆయుధ సహాయం తగ్గించిన అమెరికా

One thought on “పాకిస్థాన్‌కి మైక్రోసాఫ్ట్ షాక్

Comments are closed.