టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో బుధవారం విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా టీజీపీఎస్‌సీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్. నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. పరీక్షల ప్రక్రియపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, అవన్నీ అపోహలేనని స్పష్టంగా పేర్కొన్నారు.
కోఠిలోని ఒకే పరీక్షా కేంద్రం నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు ఎంపికయ్యారన్న ఆరోపణలపై స్పందిస్తూ.. ఆ కేంద్రాలు మహిళా అభ్యర్థుల సౌకర్యార్థమే కేటాయించామని వివరించారు. అక్కడి నుంచి మెయిన్స్ రాసిన అభ్యర్థుల సంఖ్య దాదాపు 1,500 మంది కాగా, ఇతర కేంద్రాల నుంచి ఇంకా ఎక్కువ మంది ఎంపికయ్యారని కోర్టుకు తెలియజేశారు.
ఎన్నిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని, నామినల్ రోల్స్ మరియు అభ్యర్థుల వేలిముద్రల ఆధారంగా వ్యవహరించామని తెలిపారు. ఉద్యోగాల్లో ఎంపిక కాకపోయిన కొంతమంది అభ్యర్థులు, సరైన ఆధారాలు లేకుండానే అనుమానాలు వ్యక్తం చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారని న్యాయవాది వాదించారు.
ఈ కేసులో తదుపరి విచారణకు హైకోర్టు తేది నిర్ణయించనుంది.
read More : బీసీ రిజర్వేషన్లపై కవిత లేఖ హాస్యాస్పదం

One thought on “టీజీపీఎస్‌సీ గ్రూప్-1 పై వచ్చిన ఆరోపణలు నిరాధారమే”
Comments are closed.