ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటితో ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రజల ఆశీర్వాదంతో ఏడాది కాలంగా ప్రజా పాలనను విజయవంతంగా కొనసాగించామని ఆయన పేర్కొన్నారు. ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తీసుకువచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా చంద్రబాబు ట్వీట్ చేస్తూ… “సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలతో రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తిచేసుకుంది. ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా ప్రతిరోజూ శ్రమిస్తున్నాం. ఎన్నో ఆర్థిక సవాళ్ల మధ్య పేదల కోసం పింఛన్లు, అన్న క్యాంటీన్లు, దీపం-2, తల్లికి వందనం, మత్స్యకార సేవల వంటి పథకాలను అమలుచేశాం. మెగా డీఎస్సీ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాం. పెట్టుబడులు తెచ్చి ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు పెంపొందిస్తున్నాం. 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు మద్దతుగా నిలిచాం. ఈ నెలలో అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందిస్తాం. సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తూ ప్రతీ ఎకరాకు నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాజధాని నిర్మాణం, పోలవరం పనులను మళ్లీ వేగంగా ప్రారంభించాం. రైల్వే జోన్ సాధించాం. స్టీల్ ప్లాంట్‌ను కాపాడాం. మీ ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడతాం. ఏడాది విజయవంతంగా నడిపేందుకు కృషిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని తెలిపారు.
చంద్రబాబు చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజల్లో భరోసా కలిగించిన తొలి అడుగు విజయవంతమైందని, మలిదశలో మరిన్ని విజయాలను అందుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టంచేశారు.
Read More : అమరావతి నుంచి ఓ శుభవార్త!

One thought on “ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తి”
Comments are closed.