భారత్-పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో, కశ్మీర్‌లో యుద్ధ ప్రాంతంలో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు ప్రారంభమయ్యాయి. కశ్మీర్‌లోని షేర్-ఇ-కాశ్మీరీ వ్యవసాయ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయంలో (SKUAST) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 23 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాకిస్తాన్ డ్రోన్లతో జరిపిన దాడుల కారణంగా, కశ్మీర్‌లో పరిస్థితి తీవ్రమైంది.
విద్యార్థులు, “మేము యుద్ధ ప్రాంతంలో చిక్కుకొని, ఇక్కడ పరిస్థితి వేగంగా దిగజారిపోతుంది. విమాన సర్వీసులు నిలిపివేయడంతో మేము బయటకు వెళ్లలేకపోతున్నాం. ఈ ప్రమాదకర ప్రాంతం నుంచి మమ్మల్ని తక్షణమే తరలించాలి” అని లేఖ రాశారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని, జిల్లా కలెక్టర్, SKUAST వర్సిటీ డీన్‌లతో మాట్లాడి, విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించమని ఆదేశించారు. తద్వారా జమ్మూ కశ్మీర్ అధికార యంత్రాంగం చర్యలు చేపట్టి, 23 మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
Read More : అసదుద్దీన్ ఒవైసీ పాకిస్తాన్‌పై మండిపాటు.

One thought on “తెలుగు విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు..”
Comments are closed.