భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పాక్ చర్యలను తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఈ విధానాలకు ఇస్లాం మతంతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
“అమాయకులను, చిన్నపిల్లలను చంపమని ఇస్లాం ఎక్కడా చెప్పలేదు. ఇస్లాం పేరు చెప్పుకుంటూ అమాయకుల ప్రాణాలు తీసే హక్కు పాకిస్తాన్‌కు లేదు. చిన్న పిల్లలపై దాడులు చేయడం అరాచక చర్య. మానవతా విలువలకు ఇది విరుద్ధం. ఇస్లాం మతాన్ని తప్పుగా ఉపయోగించుకునే పాక్ చర్యలను తక్కువచెప్పే ప్రసక్తే లేదు” అని ఒవైసీ మండిపడ్డారు.
ఇదిలా ఉంటే, దేశ భద్రతకు సంబంధించిన విషయంలో మన జవానులకు మనం అన్ని వేళలా మద్దతుగా నిలవాలన్నారు. “జవానుల సేవలు గొప్పవని, దేశాన్ని కాపాడేందుకు వారు ప్రాణాలను త్యాగం చేస్తున్నారు. అలాంటి సమయంలో ప్రతి ఒక్కరినీ మనం సంఘీభావంతో నిలబెట్టుకోవాలి. మనం జాతీయ స్థాయిలో ఐక్యంగా ఉండాలి” అని ఒవైసీ పిలుపునిచ్చారు.
పాకిస్తాన్ తరచూ మజాక్ చేస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నదని విమర్శించిన ఆయన, “పాక్ దాడి చేస్తే భారత్ వెనక్కి తగ్గేది లేదు. ప్రతిసారీ శాంతి పేరుతో మనం సహనం పాటిస్తున్నాం. కానీ, దూకుడు పెరిగితే భారత సైన్యం గట్టి బదులు చెప్తుంది” అన్నారు.
తన భావోద్వేగాన్ని వ్యక్తం చేస్తూ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి దేశ భక్తిని ప్రదర్శించారు. “మన దేశం పట్ల ప్రేమ మనలో ప్రతి ఒక్కరిలో ఉండాలి. మనం తల్లి కడుపులో నుండి ఈ భూమిపై పడ్డప్పుడు మొదలయ్యే జీవితం, చచ్చే వరకు ఈ నేల కోసం, ఈ దేశం కోసం బ్రతకాలి. ఇది మన బాధ్యత. దేశానికి నిబద్ధతతో పని చేయాలి” అని పేర్కొన్నారు.
ఈ సందేశంతో ఒవైసీ తన ప్రజలకు శాంతి, ఐక్యత, జవానుల పట్ల గౌరవం అనే విషయాలను గట్టి పునరుద్ఘాటన చేశారు.
ఇలాంటి వ్యాఖ్యలు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు స్పష్టమైన దిశనిదిచ్చేలా కనిపిస్తున్నాయి.
Read More : భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు.

3 thoughts on “అసదుద్దీన్ ఒవైసీ పాకిస్తాన్‌పై మండిపాటు.”
Comments are closed.