తెలంగాణలో వర్షాల కబురు

తెలంగాణ ప్రజలకు తాత్కాలిక ఉపశమనం ఇచ్చే శుభవార్త వెల్లడైంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

ఈ వర్షాల ప్రభావంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి రెండు నుంచి మూడు డిగ్రీల వరకూ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మరింత వివరాల్లోకి వెళ్తే, రానున్న రెండు రోజుల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇక ఈ రోజు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది.

ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ కేంద్రం విజ్ఞప్తి చేసింది.

Read More : తెలుగు విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు..

One thought on “తెలంగాణలో వర్షాల కబురు

Comments are closed.