గద్వాల్ జిల్లా శాంతినగర్ మండలం బూడిదపాడు గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు జూరాల ప్రాజెక్టులో దూకి గల్లంతయ్యాడు. వివరాల్లోకి వెళితే, ప్రాజెక్టు పైగా వెళ్తున్న సమయంలో కారు ఒక్కసారిగా వేగంగా వస్తుండటాన్ని గమనించిన మహేష్, ప్రమాదం జరగుతుందేమో అన్న భయంతో జూరాల ప్రాజెక్టు వద్ద 48వ గేట్ దగ్గర నుంచి నీటిలోకి దూకాడు. ఈ ఘటనలో మహేష్‌తో పాటు ఉన్న మరో వ్యక్తి జానకిరాములకు స్వల్ప గాయాలుయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ సెల్ ఫోన్ మాట్లాడుతూ నడిపిస్తున్నట్లు సమాచారం. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇక గల్లంతైన మహేష్ కోసం రెస్క్యూ టీములు ప్రాజెక్టు వద్ద గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఘటనపై గ్రామస్తులు, బంధువుల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
Read More : 2006 ముంబై బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు

2 thoughts on “రోడ్డు ప్రమాదం భయంతో దూకిన విషాదం”
Comments are closed.