తృటిలో తప్పిన తిరుపతి-హైదరాబాద్ ఇండిగో విమాన ప్రమాదం

తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు బయల్దేరిన ఇండిగో విమానం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. నిన్న రాత్రి తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాదాపు 40 నిమిషాల పాటు ఆ విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. పరిస్థితి ప్రమాదకరంగా మారేలోపు పైలట్‌ అప్రమత్తమై తిరిగి తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్‌ చేశాడు.

అయితే, ఇంతటి ఉద్విగ్న పరిస్థితిలోనూ ఇండిగో సిబ్బంది ప్రయాణికుల కోసం ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో వారు నిరాశతో వెనక్కు వెళ్లిపోయారు. ప్రయాణికులు విమాన సంస్థ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇవ్వాళ ఆ ఘటనపై అధికారులు స్పందించే అవకాశం ఉంది.

Read More : రోడ్డు ప్రమాదం భయంతో దూకిన విషాదం

One thought on “తృటిలో తప్పిన తిరుపతి-హైదరాబాద్ ఇండిగో విమాన ప్రమాదం

Comments are closed.