హరియాణాలో పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారని ఆరోపింపబడి అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, హరియాణా పోలీసులు తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం, ఆమెకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు లేవని తేలింది. జ్యోతి మల్హోత్రా పాకిస్థానీ నిఘా సంస్థల అధికారులతో సంప్రదింపులు జరిపినప్పటికీ, ఉగ్రవాద కార్యకలాపాలలో భాగస్వామ్యమేనన్న దృఢమైన సాక్ష్యాలు దర్యాప్తులో కనిపించలేదు.
హిసార్ ఎస్పీ మాట్లాడుతూ, “జ్యోతి మల్హోత్రా ఉగ్రవాద సంస్థలతో ఎటువంటి సంబంధాలు లేవని, ఆమె ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొనలేదని మా దర్యాప్తు స్పష్టం చేసింది. ఆమె పాకిస్థాన్ నిఘా వర్గాల అధికారులతో టచ్‌లో ఉన్న విషయాన్ని గుర్తించాం, కానీ భారత సైన్య వ్యూహాల గురించి అవగాహన తక్కువగా ఉంది” అని తెలిపారు.
ప్రస్తుతం ఈ కేసులో మరింత లోతైన విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలియజేశారు.
Read More : 12 ఏళ్ల బాలికపై పాఠశాలలోనే గ్యాంగ్‌రేప్

One thought on “జ్యోతి మల్హోత్రా కేసులో ఉగ్రవాద సంబంధాలు లేవని పోలీసులు.”
Comments are closed.