బంగారు ఆభరణాల విక్రయాలు తగ్గుతున్న నేపథ్యంలో వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బంగారు ఆభరణాలపై డిమాండ్ పెంచేందుకు 9 క్యారెట్ల బంగారానికి హాల్‌మార్క్ ప్రమాణాలను ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) 24, 23, 22, 20, 18, 14 క్యారెట్ల బంగారానికి మాత్రమే హాల్‌మార్క్ ఆమోదం ఇస్తూ వచ్చింది.
జూన్ నెలలో బంగార అమ్మకాలు పరిమాణ పరంగా 60 శాతం మేరకు పడిపోయిన నేపథ్యంలో, తక్కువ బరువుతో కూడిన ఆభరణాలకు డిమాండ్ పెంచే దిశగా ఈ చర్య తీసుకుంది. దీనితో వినియోగదారులకు అధిక ఎంపికలు లభించనున్నాయి. మధ్యతరగతి వినియోగదారుల ప్రయోజనాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Read More : రోడ్డు ప్రమాదం భయంతో దూకిన విషాదం

One thought on “9 క్యారెట్ల బంగారానికి హాల్‌మార్క్ ఆమోదం”
Comments are closed.