కేంద్ర ప్రభుత్వం మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఆగస్టు 13 నుంచి కొత్త గడువు అమల్లోకి రానుండగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 వరకు రాష్ట్రపతి పాలన కొనసాగనుంది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రపతి పాలన పొడిగింపు తీర్మానాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టగా, ఆమోదం లభించింది.
గమనించాల్సిన విషయం ఏమిటంటే, 2023 మే నెలలో మణిపూర్‌లో తెగల మధ్య ఘర్షణలు చెలరేగి, రాష్ట్రంలో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొన్నది. ఈ పరిణామాల మధ్య 2025 ఫిబ్రవరి 13న సీఎం బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేయడంతో, కేంద్రం రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించింది.
మణిపూర్‌లో గత 21 నెలలుగా కొనసాగుతున్న అల్లర్లు, హింస కారణంగా ఇప్పటివరకు 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 60 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. రాష్ట్ర ప్రస్తుత శాసనసభ కాలపరిమితి 2027లో ముగియనుంది.


One thought on “మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన మరో ఆరు నెలలు”
Comments are closed.