యాక్షన్ థ్రిల్లర్ అభిమానులకు భారీ శుభవార్త! ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాలు సాధించిన ‘జాన్ విక్’ ఫ్రాంచైజీ కొత్త సీక్వెల్‌తో రాబోతుందని లయన్స్‌గేట్ అధికారికంగా ప్రకటించింది. చాప్టర్ 4’ సినిమాతో కథ ముగిసినట్లే అనిపించినా, ఈ ఫ్రాంచైజీపై ఉన్న అభిమానాన్ని దృష్టిలో ఉంచుకుని, ‘జాన్ విక్ 5’ను రూపొందిస్తున్నట్టు చిత్రబృందం వెల్లడించింది.
ఇప్పటి వరకు ప్రధాన పాత్రధారి కియాను రీవ్స్ ఈ కొత్త భాగంలో కనిపిస్తారా అనే అంశంపై స్పష్టత రాలేదు. ‘చాప్టర్ 4’ ముగింపులో ఆయన పాత్రకు భారీ క్లైమాక్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ, ఈ కొత్త సీక్వెల్ ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి ఇప్పటినుంచే అభిమానుల్లో పెరుగుతోంది.
‘జాన్ విక్’ సినిమాలు యాక్షన్ థ్రిల్లర్లలో ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాయి. గన్‌ఫైట్స్, హై ఓక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లు, హార్డ్‌హిట్టింగ్ స్క్రీన్‌ప్లే కారణంగా ఈ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ నేపథ్యంలో ‘జాన్ విక్ 5’ ఎలా ఉండబోతుందో, ఇందులో ఏ కొత్త కథాంశం చూపించబోతున్నారో చూడాలి!
తాజా హాలీవుడ్ అప్‌డేట్స్ కోసం ఫాలో అవ్వండి!

One thought on “‘జాన్ విక్ 5’ అధికారికంగా ప్రకటించిన లయన్స్‌గేట్ – అస్సాసిన్ సాగా కొనసాగుతుంది!”
Comments are closed.