దక్షిణ భారత సినిమాల ప్రభావంపై అమీర్ ఖాన్ వ్యాఖ్యలు

Ameer Khan

బాలీవుడ్‌లో మల్టీప్లెక్స్ల ప్రభావం పెరిగిన తర్వాత, నగర జీవన శైలికి దగ్గరగా ఉండే ఆధునిక కథల మీద ఎక్కువ దృష్టి సారించబడింది. అయితే, ఇదే సమయంలో దక్షిణ భారత సినిమా మాత్రం తన మాస్ అపీలును నిలబెట్టుకుంది.

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఈ విషయంపై స్పందిస్తూ, ఈ మార్పు బాలీవుడ్ చిత్రాలను ప్రభావితం చేసిందని, దక్షిణ భారత సినిమాల ప్రభావం గణనీయంగా పెరిగిందని అభిప్రాయపడ్డారు. ఆయన మాట్లాడుతూ “ఈ మార్పు ప్రేక్షకులను దక్షిణ భారతీయ చిత్రాలవైపు ఆకర్షించిందని, వాటిని దేశవ్యాప్తంగా మరింత ప్రజాదరణ పొందేలా చేసింది” అన్నారు.

ఇటీవల విడుదలైన పాన్-ఇండియా చిత్రాలు కేజీఎఫ్, పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్ వంటి సినిమాలు ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఉర్రూతలూగించాయి. హిందీ బెల్ట్‌లోనూ వీటి విజయం, సౌత్ సినిమాల కథన శైలిని, మాస్ యాక్షన్ డ్రామాలను ఎంతగా ఆదరిస్తున్నారో స్పష్టంగా తెలియజేస్తోంది.

దక్షిణాది చిత్ర పరిశ్రమ భారీ స్కేల్ ప్రొడక్షన్‌, ఇంటెన్స్ స్క్రిప్ట్‌లు, పౌరాణిక, చారిత్రిక, మాస్ ఎంటర్‌టైనర్‌లను సమపాళ్లలో మేళవించి ప్రజాదరణ పొందుతుండటం ఈ టాప్ హీరో అభిప్రాయాన్ని మరింత బలపరిచేలా ఉంది.

Read More

One thought on “దక్షిణ భారత సినిమాల ప్రభావంపై అమీర్ ఖాన్ వ్యాఖ్యలు

Comments are closed.