మంచు కుటుంబంలో కొన్ని నెలలుగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అన్న మంచు విష్ణు, తండ్రి మోహన్ బాబుతో విభేదాల కారణంగా మనోజ్ కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. తన కుటుంబంపై బహిరంగ విమర్శలు చేయడం కూడా పెద్ద చర్చనీయాంశమైంది.
అయితే, మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మనోజ్ అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు. తన కుమార్తె మోహన్ బాబు ఫొటోను తిలకిస్తున్న క్షణం, తండ్రితో గడిపిన ప్రత్యేకమైన అనుభవాల వీడియోను షేర్ చేస్తూ, “హ్యాపీ బర్త్‌డే నాన్న. ఈ ప్రత్యేకమైన రోజున మీతో ఉండలేకపోవడం బాధగా ఉంది. త్వరలోనే మిమ్మల్ని కలవడానికి ఎదురుచూస్తున్నా. నాన్నా, మీ మీద నా ప్రేమ అనంతం” అంటూ భావోద్వేగంగా రాశారు.
తన కుటుంబంతో విభేదాలు ఉన్నా, తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే మోహన్ బాబు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.
మనోజ్ తదుపరి చిత్రం ‘భైరవం’, మోహన్ బాబు తన కుమారుడు మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘కన్నప్ప’లో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్ 25న ‘కన్నప్ప’ విడుదల కానుండగా, ‘భైరవం’ కూడా అదే రోజున థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది ఇప్పటికే ఉన్న మంచు కుటుంబ విభేదాలను మరింత పెంచవచ్చని భావిస్తున్నారు.

One thought on “మోహన్ బాబు బర్త్‌డే: మనోజ్ షాకింగ్ సర్ప్రైజ్!”
Comments are closed.