చిరూ చెల్లెళ్లు.. ఒక్కొక్క‌రు ఒక్కో దారిలో

Chiranjeevi Hitler movie sisters

మెగాస్టార్ చిరంజీవి హీరోగా 1997లో విడుదలైన హిట్లర్ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. బిగ్ బాస్, రిక్షావోడు వంటి చిత్రాల తర్వాత చిరంజీవికి తిరిగి విజయాన్ని అందించిన సినిమా ఇదే. ఈ సినిమాలో చిరంజీవి మాధవరావుగా నటించగా, ఆయనకు ఐదుగురు చెల్లెళ్లు ఉన్నాయనే కథతో ముందుకు సాగుతుంది.

చిరంజీవి చెల్లెళ్లుగా మోహిని, పద్మశ్రీ, అశ్వినీ, మీనా కుమారి, గాయత్రి నటించారు. ఈ సినిమాలో నటించిన చెల్లెళ్లందరికీ మంచి పేరు వచ్చింది, వరుసగా అవకాశాలు కూడా వచ్చాయి. అయితే ఆ ఆరంభ విజయాన్ని పెద్దగా కొనసాగించలేకపోయారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మీనా కుమారి మాట్లాడుతూ, హిట్లర్ సినిమా తర్వాత తమ ఐదుగురికీ అక్కాచెల్లెళ్ల మధ్య బంధం బాగా ఉండేదని, కానీ కాలక్రమేణా ఎవరి దారిలో వారు వెళ్లిపోయారని తెలిపారు.

మీనా కుమారి మాటల ప్రకారం — అశ్వినీ కొన్ని సీరియల్స్‌లో నటించి ప్రస్తుతం సింగపూర్‌లో సెటిలైపోయిందని, మోహిని గురించి ఇప్పటికి ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. గాయత్రి మాత్రం ఇప్పటికీ సీరియల్స్ చేస్తూ తానుతో టచ్‌లోనే ఉందని తెలిపారు. పద్మశ్రీ పెళ్లి తర్వాత యాక్టింగ్‌ను మానేసిందని, తాను కూడా ఆమెతో టచ్‌లో లేదన్నారు. ప్రస్తుతం తాను, గాయత్రి మాత్రమే ఇండస్ట్రీలో కొనసాగుతున్నామని, అశ్వినీ మళ్లీ యాక్టింగ్‌లోకి రావాలని ఆసక్తి చూపుతోందని చెప్పారు. అలాగే, ఈ హిట్లర్ సినిమా 1996లో వచ్చిన మలయాళ హిట్లర్ రీమేక్ కావడం విశేషం. అసలు స్క్రిప్ట్ మొదట ఈవీవీ సత్యనారాయణ వద్దకు వెళ్లినా, ఆయన బిజీగా ఉండటం వల్ల ముత్యాల సుబ్బయ్య దానిని డైరెక్ట్ చేశారు.

Read More

One thought on “చిరూ చెల్లెళ్లు.. ఒక్కొక్క‌రు ఒక్కో దారిలో

Comments are closed.