భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి పెరుగుతోంది

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో వరద ప్రవాహం గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా భద్రాచలం వద్ద నీటిమట్టం వేగంగా పెరిగిపోతోంది. ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో గోదావరి నీటిమట్టం 24 అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో, రాబోయే గంటల్లో నీటిమట్టం మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. గోదావరి ఒడ్డున ఉన్న స్నాన ఘట్టాల వద్ద వరదనీరు మెట్ల వరకు చేరింది. భక్తులు అప్రమత్తంగా ఉండాలని, లోతైన ప్రాంతాల్లోకి వెళ్లకుండా నది ఒడ్డునే స్నానం చేయాలని అధికారులు సూచిస్తున్నారు. హెచ్చరికల బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.

ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినట్టైతే వెంటనే స్పందించేందుకు నలుగురు గజ ఈతగాళ్లతో పాటు లాంచీలు, పడవలను ముందుగానే సిద్ధంగా ఉంచారు. ప్రజలు ఎలాంటి అప్రమత్తత లేకుండా ప్రవాహ ప్రాంతాల్లోకి వెళ్లకూడదని అధికారులు స్పష్టం చేశారు.

Read More : వైఎస్సార్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం భగ్గుమంటూ…?

One thought on “భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి పెరుగుతోంది

Comments are closed.