సింగపూర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ గాయపడ్డ ఘటనపై ఆందోళన కొనసాగుతున్న వేళ, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు.
ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది విద్యార్థులు గాయపడగా, ఓ 10 ఏళ్ల బాలిక దుర్మరణం చెందింది. గాయపడిన వారిలో పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కూడా ఉన్నాడు.
మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత ఇస్తూ, మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ, “ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. సింగపూర్‌లోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తక్షణంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వైద్య బృందం ఆయనను నిశితంగా పర్యవేక్షిస్తోంది,” అని వెల్లడించారు.
ఈ ఘటనపై పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తూ మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
Read More : పవన్ కుమారుడికి గాయాలు – ఘటనపై జగన్ సహా పలువురు ప్రముఖుల స్పందన.

2 thoughts on “సింగపూర్ స్కూల్ అగ్నిప్రమాదం: మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన”
Comments are closed.