గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసు క్రీస్తు త్యాగాన్ని స్మరించిన జగన్

Ys Jagan

ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ని ఆధ్యాత్మికంగా, భక్తిపూర్వకంగా ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, వైఎస్ జగన్‌ గారు “ఎక్స్” వేదికగా ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — మానవాళి పట్ల అపారమైన ప్రేమను చాటుతూ, అందరి పాపాల రక్షణ కోసం తన ప్రాణాన్ని అర్పించిన ప్రభువు యేసుక్రీస్తు త్యాగాన్ని గుడ్ ఫ్రైడే రోజు స్మరించుకుంటామని తెలిపారు.

జీసస్‌ జీవితం నుంచి మనం ప్రేమ, దయ, క్షమ, సహనం, త్యాగం అనే విలువలను నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మానవత్వాన్ని పరిపుష్టి చేసే ఈ మహోన్నత సందేశాన్ని ప్రతివారూ హృదయపూర్వకంగా ఆచరించాలని సూచించారు.

కరుణామయుడైన యేసు క్రీస్తు శిలువ మోసిన ఈ గుడ్ ఫ్రైడే రోజున, ఆయన చూపిన దయామయ మార్గాన్ని గుర్తు చేసుకుంటూ, సమాజంలో సానుకూల మార్పుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జగన్ ఆకాంక్షించారు.

Read More : భూమన కరుణాకర్‌రెడ్డిపై తిరుప‌తి ఎస్వీయూ పోలీసుల వద్ద కేసు నమోదు

One thought on “గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసు క్రీస్తు త్యాగాన్ని స్మరించిన జగన్

Comments are closed.