మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే 299 టీఎంసీల నీటి పంపకాలు జరిగాయని హరీష్‌రావు పేర్కొన్నారు.
అసెంబ్లీ మీడియా పాయింట్‌లో హరీష్‌రావు మాట్లాడుతూ, తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల 299 టీఎంసీల నీరు తాత్కాలికంగా కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన తప్పిదమని ధ్వజమెత్తారు. నీటి కేటాయింపుల అంశంలో ఢిల్లీకి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ వెళ్లారని, తెలంగాణకు అన్యాయం జరిగేలా వారు ఎందుకు ఒప్పుకున్నారో ప్రశ్నించారు.
ఉత్తమ్‌పై తీవ్ర ఆరోపణలు
పొతిరెడ్డిపాడు అంశంలో పీజేఆర్ పోరాడారని, కానీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవుల కోసం నోరుమూశారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ఒక్కరోజు కూడా వ్యతిరేకించలేదని, అయితే 40 రోజుల పాటు బీఆర్ఎస్ అసెంబ్లీలో నిరసన తెలిపిందని గుర్తుచేశారు. తెలంగాణ కోసం 6 మంత్రి పదవులను వదులుకున్నామని హరీష్‌రావు వివరించారు.
కేసీఆర్ పాలనపై ప్రశంసలు
తెలంగాణకు నీటి హక్కు కోసం కేసీఆర్ చేసిన కృషిని హరీష్‌రావు కొనియాడారు. సెక్షన్ 3ని సాధించి 573 టీఎంసీల నీటిని తెలంగాణకు తీసుకురావడంలో కేసీఆర్ పాత్ర కీలకమని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు కట్టడం వల్ల ఖమ్మానికి నీళ్లు అందించగలిగామని గుర్తుచేశారు.
కాంగ్రెస్‌పై మండిపాటు
నల్గొండలో పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని, కృష్ణా నీళ్లను సముద్రంలో కలిపినదీ కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని హరీష్‌రావు ధ్వజమెత్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టును ఖాళీ చేసేలా ద్రోహం చేశారని ఆరోపించారు.
హుజూర్‌నగర్‌ను ముంపునకు గురి చేసి ఆంధ్రాలో మూడో పంటకు నీళ్లు ఇచ్చారని ఆరోపించారు. పులిచింతల నిర్వాసితులకు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసి వారికి న్యాయం చేసినదీ కేసీఆర్ ప్రభుత్వమేనని హరీష్‌రావు స్పష్టం చేశారు.

One thought on “హరీష్‌రావు ఆగ్రహం: మంత్రి ఉత్తమ్‌పై తీవ్ర విమర్శలు”
Comments are closed.