భారత్‌లో టెలికాం టారిఫ్‌లకు మళ్లీ పెరుగుదల సంకేతాలు..

భారతదేశ టెలికాం రంగంలో మరోసారి టారిఫ్‌ల పెంపు జరగనుంది. 2025 చివరినాటికి మొబైల్ ఛార్జీలను 10-20 శాతం వరకు పెంచే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది గత ఆరు సంవత్సరాల్లో నాలుగోసారి టారిఫ్ పెంపుగా నిలవనుంది.

కంపెనీలు తమ పెట్టుబడుల అవసరాలను తీర్చుకోవడంలో భాగంగా, ఆదాయాన్ని మరింతగా పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇక ఇటీవలే వోడాఫోన్ ఐడియా (Vi)కి సంబంధించి, రూ.36,950 కోట్ల విలువైన స్పెక్ట్రమ్ బకాయిలను ఈక్విటీలోకి మారుస్తూ కేంద్రం ఆమోదమిస్తూ, టెలికాం కంపెనీలో ప్రభుత్వ వాటాను 22.6 శాతం నుంచి 49 శాతం వరకు పెంచింది.

ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ బర్న్‌స్టీన్ తాజాగా విడుదల చేసిన నివేదికలో… “2025 నవంబర్-డిసెంబర్ మధ్య టెలికాం టారిఫ్‌ల పెంపు జరిగే అవకాశముంది. టారిఫ్ పెంపు వల్ల టెలికాం రంగానికి బలమైన ఆదాయ స్థిరత లభిస్తుంది. 2025-27 మధ్య ఎయిర్‌టెల్‌, రిలయన్స్ జియో వంటి ప్రధాన కంపెనీల ఆదాయ వృద్ధి డబుల్ డిజిట్ శాతానికి చేరే అవకాశముంది” అని పేర్కొంది.