సౌదీ అరామ్‌కో – చైనా BYDతో ఉమ్మడి ఒప్పందం…

సౌదీ ఆయిల్ దిగ్గజం అరామ్‌కో, చైనా ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ BYDతో కొత్త ఎనర్జీ వాహనాల అభివృద్ధిపై ఉమ్మడి ఒప్పందం కుదుర్చుకుంది. వాహన సామర్థ్యం, పర్యావరణ అనుకూలత పెంపొందించడమే ఈ ఒప్పందం లక్ష్యం.

అరామ్‌కో టెక్నాలజీస్ యూనిట్ ద్వారా ఈ ఒప్పందాన్ని సంతకం చేశారు. ఇదే సమయంలో టెస్లా కూడా సౌదీ మార్కెట్‌లో అడుగుపెట్టడం గమనార్హం. తక్కువ కార్బన్ ఇంధనాలపై పరిశోధన చేస్తున్నట్లు అరామ్‌కో ప్రకటించింది.

సౌదీ అరేబియా 2029 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని 30 శాతానికి పెంచే లక్ష్యంతో ముందుకెళ్తోంది. టెస్లా, BYD మధ్య ప్రపంచ మార్కెట్‌లో పోటీ తీవ్రంగా కొనసాగుతోంది.

Read More : భారత్‌లో టెలికాం టారిఫ్‌లకు మళ్లీ పెరుగుదల సంకేతాలు..