“రేవంత్ రెడ్డి పాలనలో రవాణా శాఖ ఆదాయం తగ్గిందా..?”

రెవెన్యూ పెంచేందుకు వాహనదారులపై జరిమానాల వేటు వేసినప్పటికీ… రవాణా శాఖ ఆదాయం రేవంత్ రెడ్డి పాలనలో రివర్స్ గేర్‌లో పడిపోయింది.

2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.8,178 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ వాస్తవంగా వచ్చిన ఆదాయం రూ.6,761.81 కోట్లకే పరిమితమైంది. అంటే లక్ష్యంతో పోల్చితే దాదాపు రూ.2 వేల కోట్లు తక్కువే వచ్చింది.

గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో రవాణా శాఖకు రూ.6,990.29 కోట్లు ఆదాయం వచ్చినప్పటికీ… ఈ ఏడాది అదే ఆదాయంలో 3.26% తగ్గుదల నమోదైంది.

కార్ల అమ్మకాలు గణనీయంగా తగ్గిపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే మరోవైపు వాహనదారులపై భారీ జరిమానాలు విధించడం వల్ల కొంత మేర జరిమానాల ద్వారా ఆదాయం పెరిగినప్పటికీ… వాహనాల రిజిస్ట్రేషన్, కొత్త వాహనాల అమ్మకాల లోటు వల్ల మొత్తం ఆదాయం తగ్గిపోయింది.

ఇదే తీరుతో పోతే రాబోయే రోజుల్లో రవాణా శాఖపై మరింత ఆర్థిక ఒత్తిడి నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read More : వరంగల్: మూడేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం…

One thought on ““రేవంత్ రెడ్డి పాలనలో రవాణా శాఖ ఆదాయం తగ్గిందా..?”

Comments are closed.