ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రమాదకరంగా మారింది: నితిన్ గడ్కరీ హెచ్చరిక

దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత మితిమీరిన స్థాయిలో ప్రమాదకరంగా మారిందని కేంద్ర రహదారి, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ఢిల్లీ వాయు కాలుష్య స్థాయిలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన — “ఢిల్లీ నగరంలో మూడు రోజులు గడిపితే ఆరోగ్య సమస్యలు తప్పవు. అక్కడి కాలుష్య పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారాయి” అని అన్నారు.

స్థానిక నివాసితులే కాకుండా ఢిల్లీని సందర్శించే వారిపై కూడా అక్కడి గాలి నాణ్యత తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని గడ్కరీ హెచ్చరించారు. వాతావరణంలో వ్యాప్తి చెందుతున్న సూక్ష్మ ధూళి కణాలు, విషపూరిత గ్యాసులు ప్రజల ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేస్తున్నాయని, దీనిపై తక్షణమే సమగ్ర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.

దేశం మొత్తం లోనే కాలుష్య సమస్యకు ఢిల్లీ ఒక ప్రధాన ఉదాహరణగా మారిందని, దీని ప్రభావాన్ని తేలికగా తీసుకోకూడదని గడ్కరీ వ్యాఖ్యానించారు.

Read More : భారతదేశంలో 2025 సంవత్సరానికి సంబంధించి అత్యంత శుభ్రంగా ఉన్న 9నగరాలు