పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో, భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్స్‌పై నిషేధం విధించింది. మతపరంగా సున్నితమైన అంశాలు, తప్పుడు సమాచార ప్రచారం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిఫారసు మేరకు ఈ చర్యలు చేపట్టారు. నిషేధిత ఛానెళ్లలో డాన్ న్యూస్, జియో న్యూస్ వంటి ప్రముఖ పాక్ ఛానెల్స్ ఉన్నాయి. అలాగే బీబీసీ నివేదికలపై కూడా కేంద్రం వివరణ కోరింది.
ఇంకా లక్నోలోని ఆధార్ సేవా కేంద్రంపై దర్యాప్తు కొనసాగుతోంది. పాకిస్థానీయులకు అక్రమంగా ఆధార్ కార్డులు జారీ చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపట్టారు.
పహల్గామ్ దాడిలో 26 మంది మరణించగా, దర్యాప్తుకు ఎన్ఐఏకు బాధ్యత అప్పగించారు. పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించడంతో నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తతలు పెరిగాయి.

One thought on “పాకిస్తానీ యూట్యూబ్ ఛానెళ్లపై భారత్ నిషేధం!”
Comments are closed.