కేంద్ర జలశక్తి మంత్రి సీ.ఆర్. పాటిల్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రం ఏ మాత్రం ఆమోదించదని స్పష్టం చేశారు. ‘‘గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని ఒక్కటే అజెండాగా ఉంచితే, ఆ సమావేశానికి తెలంగాణ రాదు’’ అని ఇప్పటికే కేంద్రానికి తెలిపామని ఆయన వెల్లడించారు. తెలంగాణకు చెందిన కృష్ణా జలాలను గతంలో చంద్రబాబు, జగన్ లు ఏపీకి తరలించారని ఆరోపించారు. భవిష్యత్తులో గోదావరిపై నాసిక్ వద్ద ప్రాజెక్టు నిర్మించాల్సిన పరిస్థితి వస్తే తెలంగాణ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే వింతగా ఉందని, అది కూలిపోతే ప్రపంచంలోని అరుదైన విఫల ప్రాజెక్టుగా మిగిలిపోతుందనే ఎద్దేవా చేశారు. ఇప్పటికే మేడిగడ్డలో సమస్యలపై ఎన్డీఎస్ఏ నివేదికలో కీలకంగా సూచించిందని పేర్కొన్నారు.
Read More : తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై సీపీఐ నారాయణ స్పందన

One thought on “తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు”
Comments are closed.