కరోనా కొత్త వైరస్ పై ఆందోళన అవసరం లేదు ?

దేశంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కీలక సూచనలు చేసింది.కరోనావైరస్ కొత్త వైరస్ పై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అయితే వారు అప్రమత్తంగా నియమాలను పాటించాలని ICMR డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ సూచించారు.

ప్రస్తుత వాతావరణంలో కొవిడ్ తీవ్రత ఎక్కువగా కనిపించకపోయినా, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, ముఖ్యంగా పెద్దలు, క్యాన్సర్ పేషెంట్లు వంటి వారు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు.

ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి నిర్లక్ష్యం కాకుండా ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ముప్పును నివారించవచ్చని చెప్పారు. ప్రజలంతా కొవిడ్ గురించి సరికొత్త అపోహలతో కాకుండా, శాస్త్రీయ సమాచారం ఆధారంగా చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు.

ప్రభుత్వ యంత్రాంగం పరిస్థితిని గమనిస్తోందనీ, అవసరమైతే తగిన చర్యలు తీసుకుంటామని డాక్టర్ బహల్ తెలిపారు. అత్యవసరమైతే ప్రజారోగ్య విభాగాలు స్థానికంగా ఆంక్షలు, నిబంధనలు అమలు చేయవచ్చని చెప్పారు.

ఐసీఎంఆర్ సూచనలు దేశ ప్రజలకు వెళుగుదారిగా మారాలని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read More : దేశంలో మళ్లీ కరోనా ముప్పు…

One thought on “కరోనా కొత్త వైరస్ పై ఆందోళన అవసరం లేదు ?

Comments are closed.