నకిలీ ఇళ్ల పట్టాల కేసులో అరెస్ట్ అయ్యి పోలీసులు కస్టడీలో ఉన్న గన్నవరం మాజీ శాసనసభ్యుడు, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. శ్వాస సంబంధిత సమస్యలు ఎదురవడంతో ఆయనను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి (GGH) తరలించారు. అక్కడ న్యూరాలజీ విభాగం వైద్యులు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు.
వంశీ ఆరోగ్యంపై గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. “వంశీకి ఫిట్స్ ఉన్నాయి. అలాగే, నిద్రపోతున్న సమయంలో శ్వాస ఆగిపోతుండటం గమనించాం. ఇది సీరియస్ సమస్య కావడంతో, స్లీప్ టెస్ట్ చేయడం అవసరం,” అని ఆయన స్పష్టంచేశారు. అయితే, ప్రస్తుతం జీజీహెచ్‌లో స్లీప్ టెస్ట్ చేయడానికి అవసరమైన సదుపాయాలు లేకపోవడంతో వంశీకి మరో హాస్పిటల్‌కు వెళ్లాలని సూచించామని చెప్పారు.
ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం వల్లభనేని వంశీని తిరిగి విజయవాడ జైలుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇక వంశీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు నిశితంగా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
Read More : YSR కడప పేరును తిరిగి రీఎస్టోర్ చేసిన ఏపీ ప్రభుత్వం

One thought on “గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ ఆరోగ్య పరిస్థితి మరింత విషమం.”
Comments are closed.