పండ్లు ఆరోగ్యానికి మంచివే… కానీ కొన్ని కలయికలు ప్రాణానికి హానికరం!

ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవడం చాలా అవసరం. ఇవి విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌తో శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. అయితే మిక్స్‌డ్ ఫ్రూట్స్‌ పేరుతో అన్ని రకాల పండ్లను కలిపి తినడం అనారోగ్యానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని పండ్ల కలయికలు జీర్ణ సమస్యలు, అసిడిటీ, తలనొప్పులు, రక్తహీనత వంటి సమస్యలకు కారణమవుతున్నాయని వారు చెబుతున్నారు. తినే సమయంలో కొన్ని పండ్లను వేరుగా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

ఇవిగో ప్రమాదకరమైన పండ్ల కలయికలు:

  1. పుచ్చకాయ ఇతర పండ్లతో కలిపి తినకండి
    పుచ్చకాయ నీటి శాతం ఎక్కువగా ఉండే పండు. ఇది వేగంగా జీర్ణమవుతుంది. కానీ ఇతర పండ్లతో కలిపి తింటే జీర్ణ సమస్యలు, bloating, అజీర్ణం వంటి సమస్యలు వచ్చే అవకాశముంది. చెర్రీలు, మామిడిపండ్లను కూడా ఇతర పండ్లతో కలిపి తినకూడదు.
  2. సిట్రస్ పండ్లు + తీపి పండ్లు = హానికరం
    ద్రాక్ష, స్ట్రాబెర్రీ, ఆపిల్, పీచెస్ వంటి పండ్లు సిట్రస్ పండ్లలోకి వస్తాయి. వీటిని అరటి, ఎండుద్రాక్ష వంటి తీపి పండ్లతో కలిపి తినడం శరీరంలో అసిడిటీలను పెంచి జీర్ణ సమస్యలు, తలనొప్పికి కారణమవుతుంది.
  3. బొప్పాయి + నిమ్మకాయ – హిమోగ్లోబిన్ అసమతుల్యతకు దారి
    ఈ రెండు పండ్లను కలిపి తినడం వల్ల రక్తహీనత, హిమోగ్లోబిన్ అసమతుల్యత ఏర్పడే అవకాశముంది. వీటిని వేర్వేరుగా తీసుకోవడమే మంచిది.
  4. పండ్లు + కూరగాయలు – మంచి కాంబినేషన్ కాదు
    పండ్లు స్వభావతః మధురంగా ఉంటాయి. వాటిని క్యారెట్, బీట్‌రూట్ వంటి కూరగాయలతో కలిపి తినడం వల్ల జీర్ణశక్తి దెబ్బతిని, కడుపు నొప్పికి కారణమవుతుంది.

సంక్షిప్తంగా చెప్పాలంటే – పండ్లు ఆరోగ్యానికి మంచివే, కానీ అవగాహనతో తీసుకుంటేనే మేలు. ఏ పండు ఎప్పుడూ, ఎలా తినాలో తెలుసుకుని తినడమే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తప్పుడు కలయికలతో ఆరోగ్యాన్ని కోల్పోకండి!

Read More : నిద్ర పరిమితి పాటించకపోతే బరువు పెరిగే ప్రమాదం!

One thought on “పండ్లు ఆరోగ్యానికి మంచివే… కానీ కొన్ని కలయికలు ప్రాణానికి హానికరం!

Comments are closed.