ఫ్యాటీ లివర్‌ సంకేతాలు ముఖం మీదే కనిపిస్తాయి..!

ఈ మధ్య కాలంలో ఆరోగ్య సమస్యల మధ్యలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు “ఫ్యాటీ లివర్‌”. డయాబెటిస్, హైబీపీ, అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్‌, ఊబకాయం వంటి ప్రధాన సమస్యలకు బీజం వేసే వ్యాధుల్లో ఇది ఒకటి. ప్రాథమిక దశల్లో ఫ్యాటీ లివర్‌ను గుర్తించడం కష్టమే కానీ, కొన్ని లక్షణాలు ముఖం మీద కనిపిస్తే ఈ సమస్యకు ఇది సంకేతంగా భావించవచ్చు.

ప్రముఖ వైద్య నిపుణుల వివరాల ప్రకారం, కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల ఫ్యాటీ లివర్ ఏర్పడుతుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది – ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (AFLD) మరియు నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD). ఇది హెపాటిక్ స్టీటోసిస్ అని కూడా పిలవబడుతుంది. ఎటువంటి ఆల్కహాల్‌ సేవ లేకుండానే కొంతమందిలో ఈ సమస్య కనిపిస్తుంది.

అయితే, ఈ వ్యాధి ప్రారంభ దశలో కనిపించే కొన్ని ముఖ లక్షణాలు ఇవే–

1. కళ్లకింద నలుపు వలయాలు (డార్క్ సర్కిల్స్):
తగినంత నిద్ర పోయినా కళ్ల చుట్టూ నలుపు రావడం వల్ల శరీరంలో విషపదార్థాలు జమై కాలేయ పనితీరుపై ప్రభావం చూపినట్లు అర్థం అవుతుంది. అలసట ఎక్కువగా అనిపించటం, కళ్లు కాస్త ఉబ్బినట్లు కనిపించటం ఈ లక్షణాలలో భాగం.

2. పసుపు చర్మం లేదా కళ్లలో పసుపు రంగు:
చర్మం లేదా కళ్ల తెల్ల భాగాల్లో పసుపు రంగు కనపడితే అది కామెర్లు వంటి కాలేయ సంబంధిత సమస్యలకు సంకేతం కావచ్చు. ఇది కాలేయం బిలిరుబిన్‌ను సమర్థవంతంగా ప్రాసెస్ చేయలేని పరిస్థితిని సూచిస్తుంది.

3. ముఖంలో వాపు (ఉబ్బరం):
కాలేయ పనితీరు దెబ్బతినడం వల్ల శరీరంలో ద్రవాల సమతుల్యత భంగమవుతుంది. ముఖ్యంగా కళ్ల చుట్టూ, బుగ్గల వద్ద వాపు కనిపించడం గమనించవచ్చు.

4. ముఖం నలుపు లేదా నిస్తేజంగా మారటం:
ఫ్యాటీ లివర్ ఉన్నవారిలో శరీర వ్యర్థాలు పూర్తిగా బయటకు వెళ్లకపోవడంతో ముఖ చర్మం ఫేడ్ అయిపోతుంది. చర్మం మీద తేజం తగ్గి, నీరసం కనిపిస్తుంది. ఇది రక్తప్రసరణపై కాలేయ ప్రభావానికి సంకేతంగా భావించవచ్చు.

5. మొటిమలు, జిడ్డుగల చర్మం:
కాలేయం సరిగ్గా పనిచేయకపోతే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి ముఖంపై మొటిమలు, జిడ్డుగల చర్మం ఏర్పడుతుంది. ముఖ్యంగా పెద్దవారిలో ఇది సాధారణం. హార్మోన్లపై ప్రభావం చూపడం వల్ల తరచూ మొటిమలు వస్తుంటాయి.

ఈ లక్షణాలు కనిపించినవారు వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరం. ప్రారంభ దశలోనే ఫ్యాటీ లివర్‌ను గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే మరింత తీవ్రమైన సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.

Read More : కరోనా కొత్త వైరస్ పై ఆందోళన అవసరం లేదు ?

One thought on “ఫ్యాటీ లివర్‌ సంకేతాలు ముఖం మీదే కనిపిస్తాయి..!

Comments are closed.