బనకచర్లపై సీఎం రేవంత్‌పై హరీష్ రావు ఘాటు విమర్శలు.

harish rao

తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు, బనకచర్ల ప్రాజెక్టుపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రేవంత్‌కు బ్యాగుల గురించి ఉన్న అవగాహన, నీటి ప్రాజెక్టులపై లేదంటూ విమర్శలు గుప్పించారు.

హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ, “బేసిన్‌ల గురించి తెలిసినంతగా బూతుల గురించి మాత్రమే రేవంత్‌కు తెలిసుంటుంది. ఆయన విషయంలో విషయం తక్కువ.. విషం ఎక్కువ” అని వ్యాఖ్యానించారు. బనకచర్ల ప్రాజెక్టు ప్రకాశం జిల్లాలో ఉందని చెబుతున్న సీఎం రేవంత్‌కు నంద్యాల జిల్లా, ప్రకాశం జిల్లా మధ్య తేడా కూడా తెలియదని ఎద్దేవా చేశారు.

“తెలంగాణకు సంబంధం లేని ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రేవంత్, నీకు ఆ హక్కు ఎవరు ఇచ్చారు? నీకు ఏ అధికారం ఉంది? నీ అయ్య సొమ్మా ఇది?” అని హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు సహకారంతో సీఎం పదవి వచ్చినప్పటికీ, తెలంగాణ ప్రజల గొంతు వినకుండా, రాష్ట్ర హక్కులను తాకట్టు పెడుతున్నారంటూ ఆయన ఆరోపించారు. బనకచర్ల ప్రాజెక్టులో తెలంగాణకు జరిగే అన్యాయంపై స్పందిస్తూ, “తెలంగాణకు చేస్తున్న ద్రోహానికి రేవంత్ రెడ్డి ప్రజల్లోనే శిక్ష పొందాలి” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more : బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు వద్దని కేంద్రానికి ఉత్తమ్ వినతి

Our YouTube Channel Click Here

One thought on “బనకచర్లపై సీఎం రేవంత్‌పై హరీష్ రావు ఘాటు విమర్శలు.

Comments are closed.