మలయాళ చిత్రసీమ అగ్ర నటుడు మమ్ముట్టి ఆరోగ్యం గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారమైన పుకార్లకు శాశ్వత Full stop పడింది. ఆయన సన్నిహితుడైన రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ దీనిపై స్పందిస్తూ… మమ్ముట్టికి స్వల్ప అనారోగ్యం ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆయన పూర్తిగా క్షేమంగా ఉన్నారని స్పష్టం చేశారు.
బ్రిట్టాస్ మాట్లాడుతూ, “మమ్ముట్టి గారితో నాకు చాలా కాలంగా సన్నిహిత సంబంధం ఉంది. మేమిద్దరం వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా మాట్లాడకపోయినా… ఇటీవలి రోజుల్లో ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా ఓపెన్‌గా మాట్లాడుకుంటున్నాం. ఆయనకు చిన్న ఆరోగ్య సమస్య ఎదురైంది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. కానీ, ఆయన ఆరోగ్యం మెరుగుగా ఉంది. నేను ఇప్పుడే ఫోన్‌లో మాట్లాడాను” అని తెలిపారు.
ఇటీవల మమ్ముట్టి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ కొన్ని ఊహాగానాలు వైరల్ కావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఈ వార్తలను మమ్ముట్టి టీమ్ పూర్తిగా ఖండించింది. “రంజాన్ సమయంలో ఆయన షెడ్యూల్‌కి విరామం తీసుకుని కొద్దిరోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు తిరిగి షూటింగ్‌లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన త్వరలో మోహన్‌లాల్‌తో కలిసి దర్శకుడు మహేశ్ నారాయణన్ తెరకెక్కించనున్న సినిమాలో నటించబోతున్నారు” అని వెల్లడించారు.
ఇక మమ్ముట్టి త్వరగా కోలుకోవాలని కోరుతూ నటుడు మోహన్‌లాల్ శబరిమలలో ప్రత్యేక పూజలు చేసినట్లు సమాచారం. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు సహజమేనని… అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శ్రేయోభిలాషులు సూచిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, మమ్ముట్టి త్వరలోనే ఫుల్ ఎనర్జీతో సినిమాల షూటింగులకు హాజరవుతారని తెలుస్తోంది.
Read More : కుబేరా సినిమా టికెట్ ధరలకు ఏపీ ప్రభుత్వ..?
Our YouTube Channel Click Here
